పొలంలో పడి యువకుడు మృతి

21-11-2026 | 09:25pm

గంభీరావుపేట నవంబర్ 21 (విజయక్రాంతి): గంభీరావుపేట(Gambhiraopet) లోని దోసెలగూడెం కాలానికి చెందిన కడారి సురేష్(Kadari Suresh) (30) వ్యవసాయ పొలంలోని(agricultural field) బురద నీటిలో పడి మృతి చెందాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యతో గొడవల కారణంగా రెండేళ్లుగా ఆమె ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో సురేష్ మద్యానికి బానిసయ్యాడు. అతడికి ఫిట్స్ వ్యాధి కూడా ఉంది.

శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన దండు చంద్రం తన వ్యవసాయ పొలంలో సురేష్ బోర్లా పడి మృతి చెంది ఉన్నాడని అతడి తల్లి లక్ష్మికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె తన కుమారుడు బురద నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించింది.

మద్యం మత్తులో నడుస్తూ ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు పొలంలోని బురద నీటిలో పడి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని, తన కుమారుడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆర్. బాలరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు