పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

21-11-2026 | 09:23pm

బాధితులకు సత్వర న్యాయం అందించాలి 

ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ 

ములుగు, నవంబర్ 20 (విజయక్రాంతి) : జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్(District SP Kekan Sudheer Ramnath) ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను(Eturnagaram Police Station) శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ ఆవరణ, వివిధ విభాగాల నిర్వహణ, రికార్డులు, కేసుల రికార్డ్స్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని సూచించారు.

ప్రజలు తమ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి మర్యాదపూర్వకంగా స్పందించి, చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ తనిఖీలో ఏఎస్పీ ఏటూరునాగారం మానన్ భట్, డిసిఆర్ బి డిఎస్పి కిషోర్ కుమార్, సీఐ సూర్యప్రకాశ్, ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు