అర్హులకు సంక్షేమ పథకాల పంపిణీ

21-11-2026 | 09:35pm

తోలుకట్టలో స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ బీమా, ఆసరా పింఛన్లు అందజేత

మొయినాబాద్ నవంబర్ 21(విజయక్రాంతి): మండలంలోని తోలుకట్ట గ్రామంలో(Tholukatta Village) కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొలిగిద్ద సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల(welfare schemes) లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards), ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme), ఇందిరమ్మ ఆసరా పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బోడ జంగయ్య, గ్రామ సర్పంచ్ మొండ్రా రజిత, ఉపసర్పంచ్ ఇనాయత్, గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం, హమీద్ ఖాన్, ఇలిటం కుమార్, పంచాయతీ అధికారులు, రేషన్ డీలర్ సర్వర్, మాజీ ఎంపీటీసీ రవీందర్, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు