ఏసీబీ వలలో పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్

18-11-2026 | 02:13pm

రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం..

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (పీపీ) పనిచేస్తున్న డొంకెన రవీందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. రూ.1.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పీపీ రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్వగ్రామం కునారం. ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు