చలో ఢిల్లీ పార్లమెంట్ కు వెళ్దాం
ముస్తాబాద్ లో పోస్టర్ ఆవిష్కరణ
కార్మికుల హక్కులకై పోరాడుదాం
రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్(Mustabad) మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి ఆధ్వర్యంలో "చలో ఢిల్లీ(v) పార్లమెంట్ కు వెళ్దాం" పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 1,2,3 తేదీల్లో ధర్నా నిర్వహించేందుకు లక్షల మందితో ఢిల్లీ కి తరలి రావాలని సిఐటియు పిలుపుమేరకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న లేబర్ కోడ్ ను రద్దు చేసే వరకు ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమం కొరకు 1996లో వెల్ఫేర్ బోర్డు నియమించగా అందులో 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా నియమించేందుకు సంసిద్ధమవుతున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు ముట్టడికి లక్షలాదిమంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్మికుల హక్కుల పై మనమంతా ఐక్యంగా పోరాడుదామని సూచించారు.55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 9 వేల రూపాయలు పెన్షన్ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు హమాలి సంఘం అధ్యక్షుడు కట్కూరి నరేష్,పిట్ల ప్రవీణ్ జంగం లింగం,చిలకల రాజేందర్,దీటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.