విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు
జగిత్యాల,(విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ(Jagtial District Library Association) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తులో ఉన్నత చదువులు, కెరీర్ ఎంపికలు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Sanjay Kumar), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ... విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, లక్ష్య నిర్దేశం, ఉన్నత విద్యలో అవకాశాలు, భవిష్యత్తులో మంచి కెరీర్‌ను ఎంచుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ లు జంబర్తి గంగ లక్ష్మీ, రాజ్ కుమార్, పంబాల సుజాత రాము కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు సంఘనబట్ల దివాకర్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.