కీలక పారిశ్రామిక సంస్థలకు పటిష్ట భద్రత కల్పించాలి

10-11-2026 | 04:22pm

ఎన్‌టీపీసీ పరిధిలో ప్రత్యేక నిఘా, నిరంతర గస్తీ ఉండాలి

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తనిఖీ లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, నవంబర్ 10 (విజయక్రాంతి): కీలక పారిశ్రామిక సంస్థలైన(industrial organization) ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు(NTPC, RFCL) పటిష్ట భద్రత కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు(Special surveillance set up) చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) పోలీస్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, రికార్డులు, సిబ్బంది బ్యారక్‌ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ పరిశుభ్రత పాటించాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు ప్రత్యేక రాత్రి గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ఎన్‌టీపీసీ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనందున భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యానికి కూడా తావివ్వకూడదని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉద్యోగులు, ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన సైన్‌బోర్డులు, రోడ్డు ఇంజనీరింగ్ మార్పులపై సంబంధిత అధికారులకు నివేదించాలని తెలిపారు.

ఈ తనిఖీలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ వెంకట్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు