దివ్యాంగులకు రగ్గులు పంపిణీ చేసిన భాగ్యలక్ష్మి సత్యనారాయణదంపతులు

18-11-2026 | 04:39pm

సుల్తానాబాద్ , నవంబర్ 18 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని(Sultanabad town, Peddapalli district) మానసిక వికలాంగుల పునర్వాస(Rehabilitation of the mentally disabled) కేంద్రంలో ఉన్న దివ్యాంగులకు(Persons with disabilities) సుల్తానాబాద్ పట్టణం(Sultanabad town) గాంధీనగర్ కు చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ  దంపతులు 15 మంది దివ్యాంగులైన చిన్నారులకు చలికాలం చలి నుండి తట్టుకునే విధంగా ఉండటం కోసం రగ్గులు.. (చెద్దర్లు) బుధవారం పంపిణీ చేయడం జరిగింది.

యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ దివ్యాంగులకు రగులు అందజేయాలని చెప్పడంతో  దానికి స్పందించిన భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు ముందుకు వచ్చి పెద్ద మనసు తో సెంటర్లో ఉన్న 15 మంది దివ్యాంగులకు చెద్దర్లు పంపిణీ చేయడం జరిగినది, ఈ సందర్భంగా ఆ దంపతులు  మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని మేము చెదర్లు పంచుతూ ఉంటే వాళ్ల ముఖంలో చిరునవ్వు చూశామని ఆ నవ్వు మాకు చాలని వాళ్లు అన్నారు, ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు దేశెట్టి రమేష్, ఏబీఎన్ కనకయ్య,  సెంటర్ ఇన్చార్జి శ్రీనివాస్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు