దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహిద్దాం
నవంబర్ 29న కరీంనగర్‌కు భారీగా తరలివెళ్దాం
తంగళ్లపల్లి, నవంబర్ 27(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర(Telangana State) సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో(KCR's leadership) సాగిన ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని సిరిసిల్ల ప్యాక్స్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు బండి దేవేందర్ యాదవ్ అన్నారు. నవంబర్ 29న కరీంనగర్లో నిర్వహించనున్న దీక్ష దివస్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర మనదని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 29న కరీంనగర్లో జరిగే కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బండి దేవేందర్ యాదవ్ కోరారు.