పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలు బాధాకరం

12-11-2026 | 09:09am

ఏకలవ్య నగర్ కాలనీ అసోసియేషన్ 

ఎల్బీనగర్, నవంబర్ ‌12 : మన్సూరాబాద్ డివిజన్ లోని ఏకలవ్య నగర్ లో ఉంటున్న ఎరుకల తెగకు చెందిన కులస్తులపై ఇటీవల ప్రెస్ మీట్ లో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి(Malkajgiri Police Commissioner Sumathi) చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని ఏకలవ్య నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం  ఏకలవ్య నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక కమిటీ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇటీవల మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో అధిక వడ్డీలకు పాల్పడుతున్న మహిళలను ఏకలవ్య నగర్ కాలనీవాసులని చెప్పి, పోలీసులు అరెస్టు చేశారన్నారు.

అనంతరం ఏకలవ్య నగర్ కాలనీ(Ekalavya Nagar Colony), ఎరుకలను నాంచారమ్మ బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారని తెలిపారు. పోలీసులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడ్డ వస్తువులు, ద్విచక్ర వాహనాలు ఏ ఒక్కటి కూడా తమ కాలనీకి చెందినవి కావని చెప్పారు. అయితే, సీపీ సుమతి గత ప్రెస్ మీట్ లో ఏకలవ్య నగర్ ప్రస్తావించడంతో ఎరుకల కులస్తులపై పరిసర కాలనీలు వాసులు అనుమానపు చూపులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ వేధింపుల కేసులో ఏకలవ్య నగర్ కాలనీవాసులు ఎవరూ లేరని చెప్పారు.  పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తమ వంతు సహకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వైస్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్, పెద్ద శీను, ట్రెజరరి స్వామి,ఆర్గనైజింగ్ సెక్రటరీ కొన్ రెడ్డి లింగస్వామి, కోనేటి కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ కూతాడి నవీన్, కొన్ రెడ్డి రాములు, కోనేటి ధనుంజయ, కోనేటి అశోక్,దేవరాయ శివ, రుద్రాక్ష నాగార్జున, నిమ్మల సుదర్శన్, కోనేటి బక్కయ్య, కావడి నరసింహ, కుతాడి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు