జెన్సన్‌కు మస్క్ బంపర్ ఆఫర్
జెన్సన్‌ను తొలగిస్తే.. నా దగ్గరకు పంపండి: మస్క్!
వాషింగ్టన్: ప్రపంచ టెక్ రంగంలో ఇప్పుడు ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఆయనపై వచ్చిన వ్యక్తిగత సంబంధాల ఆరోపణలు, చైనా గూఢచర్యానికి సంబంధించిన అనుమానాల నేపథ్యంలో కంపెనీ Board of Directors ఆయన భవిష్యత్తుపై చర్చిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు Social Mediaలో వైరల్‌గా మారింది. జెన్సన్‌ను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ వచ్చిన ఓ పోస్టుకు మస్క్ స్పందిస్తూ.. “That would be an honor” అని పేర్కొన్నారు. అంటే జెన్సన్ తమ సంస్థలో చేరితే గౌరవంగా భావిస్తానని పరోక్షంగా సంకేతమిచ్చారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. జెన్సన్‌కు ఒక మహిళతో ఉన్న సంబంధంపై అమెరికా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయని, ఆమె చైనా కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ఎన్విడియా స్వతంత్ర విచారణ ప్రారంభించింది. అయితే కంపెనీ రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు తమకు ఆధారాలు లేవని బోర్డు గతంలో వెల్లడించింది. మరోవైపు జెన్సన్‌ను CEO పదవి నుంచి తొలగించే అంశంపై బోర్డు సమావేశమైనట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఆయనను తొలగించినట్లు అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు టెక్ ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాయి. జెన్సన్ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.