కరువు పోరాటంలో కీలక ముందడుగు

12-11-2026 | 09:12am

జీరో డ్రై స్పెల్స్ గణనపై పునఃపరిశీలనకు హైకోర్టు ఆదేశాలు

ఆదిలాబాద్, నవంబర్ 12(విజయక్రాంతి): తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలంటూ రైతు కళ్లెం కరుణాకర్ రెడ్డి చేపట్టిన న్యాయపోరాటంలో కీలక ముందడుగు పడింది. అధికారిక నివేదికల్లో ‘జీరో డ్రై స్పెల్స్’గా నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టును(High Court) ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి పునఃపరిశీలన చేయాలని ఆదేశించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు