ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ

01-11-2026 | 05:10am
  1. తయారీ రంగానికి ప్రాధాన్యం, 7.7 శాతం వృద్ధి
  2. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కుల బలోపేతం
  3. మివి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో మంత్రి 

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలుచుకునేలా టెక్నాలజీ, ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలను అనుసంధానిస్తూ కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మివి(Mivi) నూతన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తయా రీ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. 202526లో రాష్ట్ర తయారీ రంగం 7.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక స్థూల విలువ జోడింపు(జీఎస్ వీఏ)లో తయారీ రంగం వాటా రూ.1.37 లక్షల కోట్లకు చేరిందన్నారు.

తెలంగాణ రైజింగ్2047 విజన్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్ వేర్ పా ర్కులను మరింత బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తిలోనూ తెలంగాణను ముందంజలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రీసెర్చ్, ప్రొడక్ట్ డిజైన్ నుంచి విడి భాగాలు, ఎండ్ ప్రొడకట్స్ తయా రీ వరకు అన్ని కార్యకలాపాలు రాష్ట్రంలోనే జరిగేలా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లై చైన్‌తో అనుసంధానిం చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.  యువతకు నైపు ణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మివి సంస్థ ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, సౌండ్‌బార్లు తదితర ఆడియో ఉత్పత్తులను తయారు చేస్తోందని వివరించారు. తాజాగా మివి వన్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో మొబైల్ తయారీ రంగంలోకి కూడా అడుగు పెట్టిందన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, మివి ప్రతినిధులు విశ్వనాథ్ కందుల, మిధుల దేవభక్తుని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు