హస్తినాపురం డివిజన్లో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు
ఎల్బీనగర్, నవంబర్ 22: హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ కాలనీలో ఆదివారం గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మతసామరస్యం, సోదరభావం, సేవాభావానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయన్నారు. గ్యార్మీ షరీఫ్ పండుగ విశిష్టతను, హజ్రత్ గౌసే ఆజం ఆధ్యాత్మిక సందేశాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యం చారి, ముద్దకోని మనీశ్, ముద్దగొని కళ్యాణ్, మాజీ వార్డు కమిటీ సభ్యులు మొహమ్మద్ సయ్యద్ పాషా, ఇబ్రహీం, రహీం, గౌసే పాక్ జిల్లా కమిటీ సభ్యులు షాకీర్, రఘు తదితరులు పాల్గొన్నారు.