నూతనంగా ఎన్నికైన షాపురం శ్రీకాంత్ కు ఘన సన్మానం

21-11-2026 | 09:38pm

శంకర్ పల్లి: నవంబర్ 21(విజయక్రాంతి): షాపురం శ్రీకాంత్(Shapuram Srikanth) బీజేవైఎం రంగారెడ్డి జిల్లా(BJYM Ranga Reddy District) జనరల్ సెక్రటరీగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా శనివారం ఆయనకు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డిపల్లి సర్పంచ్ మొయినాబాద్ మండలం(Moinabad Mandal) షాపురం మాణిక్యం, మల్లేష్ గౌడ్ , బీసీ సంఘం నాయకుడు సిరా సాయి, బీసీ సంక్షేమ సంఘం చేవెళ్లే నియోజకవర్గ అధ్యక్షుడు బండమీది వెంకటేష్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షాపురం శ్రీకాంత్  శాలువాతో సత్కరించి, భగవద్గీతను అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధిస్తూ, ప్రజాసేవలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

మరిన్ని వార్తలు