ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

21-11-2026 | 09:38pm

గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ(Gajwel Pragyapur Municipality) ఆర్ అండ్ ఆర్  కాలనీలోని బ్రహ్మంగారి గుట్టపై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఉత్సవాల(Pothuluri Veera Brahmendra Swamy Jayanti celebrations)ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, వీరబ్రహ్మేంద్ర స్వామికి పంచామృతాభిషేకాలు, షోడశ ఉపచార పూజలు, తీర్థ ప్రసాద వితరణ, విశ్వబ్రాహ్మణ సమారాధన, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కొక్కొండ శ్రీనివాసాచారి మాట్లాడుతూ కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి  జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు కురిసి పాడిపంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మనుమయ సంఘం అధ్యక్షులు వెంకటాచారి, ఆలయ కమిటీ   ఉపాధ్యక్షులు స్వామి చారి, , ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహ చారి, కోశాధికారి నాగరాజు చారి, శివ, ప్రసాద్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు