పటాన్చెరు కాంగ్రెస్ నేతలకు విజయదశమి శుభాకాంక్షలు
మాదారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
పటాన్ చెరు /జిన్నారం, అక్టోబర్ 21 : విజయదశమి(Vijayadashami) పర్వదినాన్ని పురస్కరించుకుని మాదారం కాంగ్రెస్ పార్టీ(Madaram Congress Party) అధ్యక్షుడు సీతారాం యాదవ్(Sitaram Yadav) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj), కాటా శ్రీనివాస్ గౌడ్ సుధారాణి దంపతులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజలందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కుమ్మరి కుమార్, బజరంగ్ సింగ్, రామకృష్ణ, నరసింహ ముదిరాజ్, లింగం, వెంకటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.