సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్

16-11-2026 | 12:53pm

ఒక్క సినిమా కోసం ఇంత పెద్ద త్యాగమా? సాయి పల్లవి సంచలన నిర్ణయం!

నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్న సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమా పాత్ర కోసం ఆమె తీసుకున్న ఓ నిర్ణయం ఇంట్లో పెద్ద చర్చకు దారితీసిందట. ఏకంగా తన జుట్టును కత్తిరించుకోవడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారని స్వయంగా ఆమె వెల్లడించారు.

ఒక్క పాత్ర కోసం జుట్టుకే కత్తెర!

సాయి పల్లవి నటిస్తున్న 'ఓం చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్' సినిమాలో ఆమె సీబీఐ అధికారిగా కనిపించనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసు దర్యాప్తు చేసే కీలక పాత్రలో నటించేందుకు తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. Character కోసం పొడవాటి జుట్టును కత్తిరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

కొత్త లుక్ చూసి షాకైన తల్లి!

హెయిర్ కట్ తర్వాత ముందుగా తల్లికి Video Call చేసి తన కొత్త లుక్ చూపించారట. అయితే ఆ రూపాన్ని చూసిన తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. ఎందుకలా జుట్టు కత్తిరించుకున్నావంటూ ప్రశ్నించారట. సాయి పల్లవి సమాధానం చెప్పేలోపే ఫోన్ పెట్టేశారట. ఆ తర్వాత తల్లిదండ్రులు మళ్లీ ఫోన్ చేసి అది నిజమైన హెయిర్ కట్‌నా? లేక విగ్ పెట్టుకున్నావా? అని అడిగారని ఆమె సరదాగా గుర్తుచేసుకున్నారు.

సినిమా కథ నచ్చడంతోనే సాహసం!

కథ, పాత్ర తనకు బాగా నచ్చడంతోనే ఈ మార్పునకు సిద్ధమైనట్లు సాయి పల్లవి తెలిపారు. తన కొత్త లుక్‌కు అలవాటు పడటానికి తల్లిదండ్రులకు కొంత సమయం పట్టిందని చెప్పారు. నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన Trailer ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మరిన్ని వార్తలు