భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు
16-11-2026 | 12:55pm
కాగజ్నగర్,(విజయక్రాంతి): పట్టణంలోని ఎస్పీఎం మైదానంలో ఉత్తర భారతీయులు(North Indians) నిర్వహించిన ఛట్ పూజలు(Chhath Puja) భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కార్తీక మాసం(Kartik masam)లో ఏటా నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నీటిలో నిలబడి సూర్యుడిని ప్రార్థించారు.
ఛట్ పూజ చివరి రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former MLA Koneru Konappa) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యభగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.