మత్తుకు బానిసవుతున్న యువత

16-11-2026 | 12:58pm

పల్లెలకూ విస్తరిస్తున్న డ్రగ్స్‌, గంజాయి సంస్కృతి

యువత భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన

కల్లూరు,(విజయక్రాంతి): యువతలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండటం ఆందోళనకరమని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, పోలీస్ అండ్ ప్రెస్ మీడియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ శ్రీనివాస్ అన్నారు. కల్లూరులోని గౌరయ్య హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావం ప్రస్తుతం పల్లెలకూ విస్తరిస్తోందన్నారు.

యువత చెడు అలవాట్లకు బానిసై చదువు, క్రమశిక్షణ, కుటుంబ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని, ఉపాధ్యాయులు, సామాజిక సంస్థలు యువతకు సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువతను మత్తు మహమ్మారి నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ఈ సమావేశంలో దర్నాసి బాలరాజు,రాజు,కరుణ, జరుపుల సురేష్,కొత్తపల్లి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు