న్యూ వే వేట్ హోటల్ నుప్రారంభించిన మాజీ జడ్పీటీసీ
మునిపల్లి నవంబర్ 27 ( విజయక్రాంతి)ః మండలంలోని లింగంపల్లి గ్రామానికి(Lingampalli village) చెందిన ఫైసోద్దీన్, నవాజ్(Faisoddin, Nawaz) లు మండలంలోని కంకోల్ గ్రామ(Kankol Village) సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ వే వేట్ హోటల్(New Way Wait Hotel) ను మాజీ జడ్పీటీసీ అసద్ పటేల్, సీనియర్ నాయకుడు మక్సూద్ పటేల్, రాయికోడ్ మార్కెట్ కమిటీ (Rayikode Market Committee) చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.