భూ రీస‌ర్వేను ప‌రిశీలించిన ఆర్డీఓ

12-11-2026 | 10:34pm

మునిప‌ల్లి,(విజయక్రాంతి):   తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న భూ రీస‌ర్వే కార్య‌క్ర‌మం(Land survey program)లో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా(Sangareddy District) మునిప‌ల్లి మండ‌లం మొగ్దుంప‌ల్లి గ్రామంలో భూ రీస‌ర్వే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ...  సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నెంబర్లు, గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం తది తర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధి త రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. 

అలాగే భూ రీస‌ర్వే ద్వారా భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని తెలిపారు. అంత‌కుముందు  గ్రామంలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను మండ‌ల అధికారుల‌తో క‌లిసి పరిశీలించారు. ఆర్డీఓ వెంట  మునిప‌ల్లి  తహసీల్దార్ రంగారావు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మండ‌ల స‌ర్వేయ‌ర్ లాల్ సింగ్, డిప్యూటీ ఎమ్మార్వో ప్ర‌దీప్, జీపీఓ రాజు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి న‌ర్సింలు, రైతులు చాంద్ పాషా, శేఖర్, మహిపాల్, యాద‌య్య,  నర్సింలు, శ్రీశైలం,  జగదీశ్వర్, ప్రభాకర్, శాంతయ్య,  నందు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు