అధిక సాంద్రత పత్తి సాగుపై రైతులకు అవగాహన

12-11-2026 | 09:29pm

మేధినీపూర్‌లో పత్తి పొలాలను సందర్శించిన వ్యవసాయ అధికారులు

కొండపాక , నవంబర్ 12 : కుకునూరుపల్లి మండలం మేధినీపూర్ గ్రామంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో(Mission for Cotton Productivity Programme) భాగంగా హెచ్‌డీపీఎస్ (అధిక సాంద్రత పత్తి సాగు) విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గోవిందరాజు మాట్లాడుతూ.. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని తెలిపారు.

అనంతరం పత్తి పొలాలను సందర్శించి పంట ఎదుగుదల, మొక్కల సాంద్రత, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలను పరిశీలించారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మధు మోహన్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమ్యశ్రీ, శ్రీహరి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు