కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే ఆకాంక్షతో బీఆర్ఎస్ నేతల పాదయాత్ర
ధర్మారెడ్డిపల్లిలో ఘన స్వాగతం పలికిన మాదాసు శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్
గజ్వేల్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) మరోసారి ముఖ్యమంత్రి(Chief Minister) కావాలనే ఆకాంక్షతో మెదక్ జిల్లా(Medak District) బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన పాదయాత్రకు ధర్మారెడ్డిపల్లిలో(Dharmareddipalli) ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్(Madasu Srinivas), పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) పాదయాత్ర బృందానికి పూలమాలలతో స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్(KCR) నివాసం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని నాయకులు పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల(Irrigation project) వంటి పథకాలతో ప్రజా సంక్షేమానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వం మరోసారి రాష్ట్రానికి అవసరమని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో చేపట్టిన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, ప్రభాకర్, కొండల్ రెడ్డి, కనకరాజు, మాజీ సర్పంచులు కుమార్ గౌడ్, నాయకులు సత్యనారాయణ గౌడ్, గంజి నవీన్ శ్రీనివాస్, మావురం రాజు తదితరులు పాల్గొన్నారు.