రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బెజ్జంకి, నవంబర్ 10: రైతుల సంక్షేమం(Welfare of Farmers), వ్యవసాయ అభివృద్ధే(Agricultural development) లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పనిచేస్తోందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బెజ్జంకి మండల(Bejjanki Mandal) కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు(Farmers') ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రైతులకు సబ్సిడీపై(Subsidy) వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తనాలతో పాటు వ్యవసాయ పరికరాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించలేదని, లక్ష రూపాయల రుణమాఫీ హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలను సైతం నిలిపివేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందిస్తోందని, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లింగాల శ్రీనివాస్ కోరారు.