చేర్యాల ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ లో భారీ చోరీ

21-11-2026 | 07:42pm

* రూ.5 లక్షల విలువైన కరెంట్ వైర్లు అపహరణ

చేర్యాల, నవంబర్ 21 : చేర్యాల మండల(Cherial Mandal) కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్(Integrated Building Complex) లో కరెంట్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ సమీకృత భవనంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కరెంట్ వైర్లను(electric wires) భద్రపరిచిన గదుల తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి, లోపల ఉన్న వైర్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

శనివారం ఈ విషయాన్ని గుర్తించిన సూపర్‌వైజర్ ధర్మరాజు సుమారు ఐదు లక్షల విలువ చేసే కరెంటు వైరును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది అని చేర్యాల పోలీస్ స్టేషన్‌లో(Cherial Police Station) ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.చోరీకి గురైన సామగ్రి పూర్తి వివరాలు, వాటి ఖచ్చితమైన విలువ ఎంత అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఇదిలా ఉండగా,ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న సమీకృత భవనాన్ని ఇప్పటికైనా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు