మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి

21-11-2026 | 07:44pm

ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల సాయం అందించాలి

తేలు ఇస్తారి డిమాండ్

కొండపాక,నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని(World Fishermens Day) పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా(Siddipet District) కొండపాక మండల్ , దుద్దెడ రైతు వేదికలో శనివారం మత్స్య శాఖ DFO రాజారాం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చీఫ్ ప్రమోటర్ బాలరంగం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ జిల్లా డైరెక్టర్ తేలు ఇస్తారి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రతి మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం, 50 ఏళ్లు దాటిన వారికి రూ.4 వేల పింఛన్(Pension), సాధారణ మరణానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. చెరువుల ఎఫ్‌టీఎల్ సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని, చేప పిల్లల కొనుగోలుకు సొసైటీల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే మత్స్యకారులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్లు ఆకారం సత్తయ్య, ఐలయ్య, అధికారులు పడిగే ప్రశాంత్, వంశీ, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు