బేగంపేట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవ ఎన్నిక

12-11-2026 | 11:04pm

బెజ్జంకి: బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్(Begumpet SC Cell) నూతన అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కాడ మంచి సంపత్, బెజ్జంకి భాస్కర్ (సృజన్) ఎన్నికయ్యారు. మానకొండూర్ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిని ప్రశాంత్, జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ జనగాం శంకర్(District SC Cell General Secretary Jangaon Shankar) ఆధ్వర్యంలో గ్రామ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొమ్ము కోటి మాట్లాడుతూ దళితుల సంక్షేమం, హక్కుల సాధనతో పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొరివి లక్ష్మణ్, ఏఎంసీ డైరెక్టర్ నూనె రాజేందర్, పిట్టల అరుణ్ తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు