నాగులచవితికి ఏర్పాట్లు పూర్తి

12-11-2026 | 09:38pm

కోదాడ నవంబర్ 12 (విజయ క్రాంతి): ఈ నెల 13, 14 తేదీల్లో మండలంలోని నల్లబండగూడెంలో రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పుట్ట(Subrahmanya Swamys putta) వద్ద నాగులచవితి వేడుకలకు(Nagula Chavithi Celebrations) ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 

13న స్వామి వారికి అభిషేకాలు, ముళ్ళపాడు సీతారామాంజనేయ భక్త బృందం వారిచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందన్నారు. 14వ తేదీన నాగపంచమి సందర్భంగా అభిషేకాలు, హోమాలు ఉంటాయన్నారు. 13, 14 తేదీల్లో అన్నదానం ఉంటుందన్నారు. దీక్షా స్వాములకు సద్ది ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు