మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు ఊరట
21-11-2026 | 08:00pm
గడిచర్లపల్లిలో 80.03 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
సిద్దిపేట టౌన్, నవంబర్ 21: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్(Mallannasagar and Kondapochammasagar) నిర్వాసితుల పెండింగ్ పునరావాస సమస్య(Pending rehabilitation issue) పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట పట్టణం గడిచర్లపల్లి పరిధిలో 80.03 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితులకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని కలెక్టర్, ఆర్‌అండ్‌ఆర్ అధికారులను ఆదేశించింది. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీ చేసిన కృషికి ప్రాధాన్యం లభించింది.