వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం
లంక, ఇంగ్లాండ్‌లను దాటేసి ఆరోస్థానం కైవసం
దుబాయి, నవంబర్ 2: అంతర్జాతీయ క్రికెట్(International Cricket) లో పలు సంచలన విజయాలతో అదరగొడుతున్న ఆప్ఘనిస్తాన్ ఐసీసీ వన్డే ర్యాంకిం గ్స్లోనూ(Afghanistan ICC ODI Rankings) సంచలనం సృష్టించింది. తాజా జాబితాలో ఏకంగా ఆరో స్థానానికి దూసుకొచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లను వెనక్కి నెట్టేసింది. ఆప్ఘన్ చరిత్రలో అత్యుత్తమ ర్యాంక్ ఇదే. ఐర్లాండ్ పర్యటనలో 4 సిరీస్ గెలిచిన ఆ జట్టు ఇటీవలే జింబాబ్వే,బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై సిరీస్‌లో(Tri-series) విజేతగా నిలిచింది.
ఈ ప్రదర్శనతో తమ రేటింగ్ పాయింట్లను గణనీయంగా మెరుగుపరుచుకున్న ఆప్ఘనిస్తాన్ జట్టు ర్యాం కింగ్స్‌లో పైకి ఎగబాకింది. ప్రస్తుతం ఆప్ఘన్ ఖాతాలో 94 రేటింగ్ పాయింట్లున్నాయి. 2009లో వన్డే అరంగేట్రం చేసిన ఆ జట్టు ఇప్పటి వరకూ 191 వన్డేల్లో 96 విజయాలను అందుకుంది. శ్రీలంక , ఇంగ్లాండ్ జట్లు ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నా యి. కాగా వన్డేల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి.