చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే

03-11-2026 | 05:00am

ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు

నాగ్‌పూర్, నవంబర్ 2 : విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో సంచ లన ప్రదర్శన కనబరిచాడు. మధ్యప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో దూబే తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 23.1 ఓవర్లు వేసి 4 మె యిడెన్లతో 53 పరుగులు ఇచ్చిన దూబే 9 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విద ర్భ తరపున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు అరుణ్ ఓగిరాల్ పేరిట ఉండేది.

1967లో అరుణ్ మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఆ రికార్డును హర్ష దూబే బద్దలుకొట్టాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్ పటిదార్‌తో పాటు శుభమ్ శర్మ వంటి కీలక వికెట్లు తీసాడు. హర్ష్ దూబే స్పిన్ మాయాజాలానికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తు న్న దూబే 2024-25 రంజీ సీజన్‌లో ఏకంగా 69 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై వన్డే క్రికెట్ అరంగేట్రం చేశాడు.

మరిన్ని వార్తలు