చివరి పంచ్ ఎవరిదో?
- నేడు భారత్, కివీస్ ఐదో టీ20
- తుది జట్టులో మార్పులు
- కుల్దీప్, దూబేలకు ఛాన్స్
- మరో విజయంపై కివీస్ కన్ను
క్లీన్‌స్వీప్ అవకాశం చేజారిపోయిన వేళ టీమిండియా ఇప్పుడు 4 సిరీస్ ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మ్యాచ్‌లో ఓడిపోవడం నిరాశ కలిగించినా బౌలింగ్‌లో మెరుగైతే మళ్లీ గెలుపు బాట పట్టొచ్చని భారత్ భావిస్తోంది. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలుండగా.. వైభవ్‌ను ఆడించడంపై సస్పెన్స్ నెలకొంది. అటు నాలుగో టీ20 విజయంతో జోష్ మీదున్న కివీస్ మరో గెలుపుపై కన్నేసింది.
హామిల్టన్, అక్టోబర్ 31: హ్యాట్రిక్ విజయాలతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్(India) జోరుకు ఆక్లాండ్‌లో బ్రేక్ పడింది. అద్భుతంగా పుంజుకున్న న్యూజిలాండ్(New Zealand) క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంటూ తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇరు జట్లు హామిల్టన్ వేదికగా చివరి టీ20కి సిద్ధమయ్యాయి. సిరీస్‌ను 4 ముగించా లని భారత్ భావిస్తుంటే.. వన్డే సిరీస్‌కు ముం దు మరో విజయం సాధించాలని కివీస్ ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ భారత బౌల ర్ల సత్తాకు పరీక్షగా చెప్పొచ్చు.
నిజం చెప్పాలంటే ఈ సిరీస్‌లో మన బౌలర్లు అనుకున్న రీతిలో రాణించలేదు. కివీస్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గానే కనిపించినా చాలా లోపాలు బయటపడ్డాయి. భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకోలేకపోయాడు. కివీస్ పిచ్‌లపై అదరగొడతాడనుకున్న భువీ తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక వికెట్ తీసాడు. నాలుగో టీ20 నుంచి అతన్ని తప్పించారు. పాండ్యా ప్లేస్‌ను భర్తీ చేద్దామనుకుంటున్న వేళ నితీశ్ రెడ్డి సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో బౌలింగ్ ప రంగా మార్పులకు ఆస్కారముంది.
అందులోనూ వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేప థ్యంలో, బెంచ్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో ఆ డించే అవకాశముంది. ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తీలో ఒకరు ఆడనుండగా.. నితీష్ కుమార్ రెడ్డిని బెంచ్‌కు పరిమితం చేయవచ్చు. గత మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి భారీగా పరుగులు సమర్పించుకున్నా డు. ఈ సిరీస్‌లో మరో ఆల్‌రౌండర్ దూబేకు కూడా అవకాశం దక్కలేదు. ఒకవేళ దూబే ను ఆడించాలనుకుంటే అక్షర్ పటేల్‌ను త ప్పించే ఛాన్సుంది.
నాలుగేళ్ల తర్వాత రీఎం ట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్‌ను చివరి మ్యాచ్ ఆడించే ఛాన్సుంది. అదే జరిగితే మయాంక్ యాదవ్ బెంచ్‌కు పరిమితమవుతాడు. కానీ మయాంక్ గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. మిగిలిన కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆడ నుండగా.. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అ య్యర్, తిలక్ వర్మ, నమన్ ధీర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఒకవేళ సంజూ శాంస న్‌కు విశ్రాంతినిస్తే చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వస్తాడు. కాగా వన్డే సిరీస్‌కు కాన్ఫిడెంట్‌గా సిద్ధమవుదామనుకుంటున్న భారత్‌కు చివరి మ్యాచ్ విజ యం కీలకం కానుంది. ముఖ్యంగా బౌలింగ్‌లో మెరుగుపడితే మాత్రం భారత్ పుంజు కున్నట్టే.
మరోవైపు సిరీస్ చేజారినా నాలుగో టీ20లో కివీస్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యా టర్లు నిలకడగా రాణిస్తున్నారు. గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆక్లాండ్‌లో సెంచరీ బాదేశాడు. జా కబ్స్, బ్రేస్‌వెల్, మిఛెల్ కూడా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో మాత్రం హెన్రీ, ఫెర్గ్యుస న్ దూరమవడం కివీస్‌కు ఇబ్బందిగా మా రింది. ఇక హామిల్టన్ పిచ్ కూడా బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంటుంది. దీంతో మరోసారి హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయం.
తుది జట్ల అంచనా
భారత్ : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ రెడ్డి/దూబే, కుల్దీప్/వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్/మయాంక్ యాదవ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, సిఫర్ట్, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, మిలైన్, డఫీ, ఫిషర్, టిక్నర్/స్మిత్