ప్రపంచ క్రికెటర్లతో ఆడటం సూపర్: మాక్స్ హోల్డెన్

21-11-2026 | 07:35pm

దుబాయ్: డీపీ వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఆడటం తనకు సరికొత్త అనుభవాన్ని అందిస్తోందని ఇంగ్లండ్ మాజీ అండర్-19 కెప్టెన్ మాక్స్ హోల్డెన్(Former England Under-19 captain Max Holden) తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో కలిసి ఒకే జట్టులో ఆడే అవకాశం ఈ లీగ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌(Dubai Capitals)కు ప్రాతినిధ్యం వహించనున్న హోల్డెన్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ వంటి టోర్నీలతో పోలిస్తే ILT20లో ఆటగాళ్ల కలయిక భిన్నంగా ఉంటుందని వివరించారు.

ఇంగ్లండ్‌లోని ఫ్రాంచైజీ క్రికెట్‌లో విదేశీ ఆటగాళ్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని, కానీ ILT20లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ ఆటగాళ్లతో(International Players) పాటు స్థానికంగా ప్రతిభ కలిగిన క్రికెటర్లు కూడా ఈ లీగ్‌లో భాగమవడం సంతోషంగా ఉందన్నారు. విభిన్న క్రికెట్ శైలులు, అనుభవాలు ఒకే జట్టులో కలవడం ద్వారా ఆటగాళ్లకు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి క్రికెటర్లతో కలిసి ఆడే ఈ అవకాశం తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని మాక్స్ హోల్డెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు