ఫిట్‌నెస్ టెస్టులో పంత్ ఫెయిల్

03-11-2026 | 05:00am

2 రోజుల్లో మరో అవకాశం

బెంగళూరు, నవంబర్ 2 : న్యూజిలాండ్‌తో(New Zealand) జరిగే టెస్ట్ సిరీస్‌లో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఆడడం పై సస్పెన్స్ కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకున్నప్పటకీ పంత్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. తాజాగా బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో(BCCI Centre of Excellence) నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడు. మొదటి టెస్టులో ఫెయిల్ అయి నప్పటికీ, పంత్‌కు బీసీసీఐ మెడికల్ టీమ్ మరో రెండు రోజుల్లో రెండో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనుంది. దీనిలో పాసయితే పంత్ న్యూజి లాండ్‌కు బయలుదేరి  వెళ్లి జట్టుతో కలుస్తాడు. 

మరిన్ని వార్తలు