కోచ్‌గా రాబిన్ ఊతప్ప
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్పను జట్టు కొత్త Batting Coachగా నియమించింది. తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన ఊతప్పకు ఇప్పుడు కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తూ ఫ్రాంచైజీ కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. ఈ నియామకంతో జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
40 ఏళ్ల రాబిన్ ఊతప్పకు(Robin Uthappa) ముంబై ఇండియన్స్‌తో గతంలోనే అనుబంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో అతను MI తరఫున బరిలోకి దిగాడు. అంతేకాకుండా 2007లో భారత్ తొలిసారి T20 World Cup విజేతగా నిలిచిన జట్టులోనూ ఊతప్ప సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు IPLలోనూ ఆడిన అనుభవం ఆయనకు ఉంది. ఈ అనుభవాన్ని యువ ఆటగాళ్లకు అందించడంలో ఊతప్ప కీలక పాత్ర పోషిస్తాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
ఊతప్ప నియామకంపై ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తొలి సీజన్ నుంచి తమతో అనుబంధం ఉన్న ఊతప్ప, ఇప్పుడు మరింత అనుభవంతో తిరిగి జట్టులోకి వస్తున్నాడని పేర్కొంది. ఆటపై లోతైన అవగాహన, సమర్థవంతమైన Communication Skills, యువ ఆటగాళ్లకు సరైన మార్గనిర్దేశం చేసే సామర్థ్యం ఆయనలో ఉన్నాయని ప్రశంసించింది. 2027 సీజన్లో MI బ్యాటింగ్ యూనిట్‌ను తీర్చిదిద్దడంలో ఊతప్ప కోచింగ్ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.