ముగిసిన స్కంద ట్రై స్పోర్ట్స్ చాంపియన్‌షిప్

03-11-2026 | 05:05am

హైదరాబాద్, నవంబర్ 2 : పాఠశాల స్థాయిలో(School level) క్రీడాప్రతిభను గుర్తించేందుకు ప్రముఖ సంస్థ 7హెచ్ స్పోర్ట్స్(7H Sports) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్కంద ఇంటర్ స్కూల్ ట్రై స్పోర్ట్స్ చాంపియన్ షిప్(Skanda Inter-School Tri-Sports Championship) ఘనంగా ముగిసిం ది. బ్రాహ్మణపల్లిలోని స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో నగరవ్యాప్తంగా 40 పాఠశా లలకు చెందిన 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అథ్లెటిక్స్, చెస్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయి క్రీడా ప్రతిభకు ఈ ఛాంపియన్‌షిప్ ప్రతీకగా నిలిచిం ది.

ఈ సందర్భంగా 7హెచ్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తిం చి, ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. ఇటువంటి అంతర్ పాఠశాల చాంపియన్‌షిప్‌ల ద్వారా, బలమైన క్రీడా సంస్కృతిని సృ ష్టించడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ఉన్నత స్థాయి పోటీలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కాగా చిన్నారుల్లో క్రీడానైపుణ్యా న్ని వెలికితీసే ఇలాంటి పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందని స్కంద ఇంటర్నే షనల్ స్కూల్ డీన్ ఆఫ్ ప్రిన్సిపాల్స్ షింజో చెప్పారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు విద్యార్థులకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

మరిన్ని వార్తలు