పేదల కోసం పోటు ప్రసాద్‌ పోరాటం చిరస్మరణీయం!

27-11-2026 | 10:02pm

* బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ పోటు ప్రసాద్‌..

రెండో వర్ధంతి సభలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య

గరిడేపల్లి, నవంబర్ 27 (విజయక్రాంతి) : పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాట మార్గాన్ని ఎంచుకొని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన కామ్రేడ్ పోటు ప్రసాద్‌(Comrade Potu Prasad) సేవలు చిరస్మరణీయమని సీపీఐ గరిడేపల్లి మండల కార్యదర్శి కడియాల అప్పయ్య(CPI Garidepally Mandal Secretary Kadiyala Appayya) అన్నారు. గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో కామ్రేడ్ పోటు ప్రసాద్‌ రెండో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కడియాల అప్పయ్య.. పోటు ప్రసాద్‌ స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ పోటు ప్రసాద్‌ బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం అనేక సమరశీల పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. ప్రతి క్షణం ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యలపై నిర్భయంగా గొంతెత్తిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు.కమ్యూనిస్టు పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన పోటు ప్రసాద్‌.. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కార్మికులు, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు.

ఆయన మరణం సీపీఐ పార్టీకి, పేద ప్రజలకు తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి, సీపీఐ మండల సహాయ కార్యదర్శి పోటు పూర్ణచంద్రరావు, రంగాపురం గ్రామ సర్పంచ్ కట్ట కళ్యాణి, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు ఎడ్ల అంజన్ రెడ్డి, తిరగమల్ల కిరణ్, కుందూరు వెంకటరెడ్డి,రంగాపురం గ్రామ శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పోటు కృష్ణ, కట్ట అశోక్, పోటు చంటిబాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు