మోతె మండలంలో డీఈఓ ఆకస్మిక తనిఖీ..

07-10-2026 | 07:00pm

విద్యార్థుల విద్యా నైపుణ్యాలపై పరిశీలన.. సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా విద్యాధికారి...

మోతె, అక్టోబర్07 (విజయక్రాంతి): మోతె మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి సిహెచ్. శ్రీనివాసరావు(DEO Ch. Srinivasa Rao) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని కరక్కాయలగూడెం, విభలాపురం, ఉర్లుగొండ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించి పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధనా విధానాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడిన డీఈఓ.. వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహన, విద్యా నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సమాధానాలను స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఉన్న అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన అనంతరం వారి విద్యా ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతి విద్యార్థి విద్యలో ముందుకు సాగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, హాజరు శాతంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీతో పాఠశాలలలో ఉపాధ్యాయులు,  విద్యార్థుల్లో మరింత బాధ్యత పెరిగిందని, జిల్లా విద్యాధికారి స్వయంగా తరగతి గదుల్లో విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పరిశీలన చేశారు.

మరిన్ని వార్తలు