పట్టభద్రుల ఓటు నమోదుతో తెలంగాణ భవిష్యత్‌కు బాటలు
- ఏనుగుల రాకేష్‌రెడ్డి గెలుపునకు పట్టభద్రులు అండగా నిలవాలి
- అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు
మోతె, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి(BRS candidate Enugula Rakesh Reddy) గెలుపు కోసం అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు కావాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం మోతె మండలంలోని కూడలి, రావిపహాడ్ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినా నిరాశ చెందకుండా, పట్టభద్రుల ప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి రాకేష్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుల కంటే ప్రజల వెన్నంటి ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. అర్హులైన పట్టభద్రులు గూగుల్ ఫారం ద్వారా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ను, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగేష్, ఉప సర్పంచ్ పల్స మల్సూర్, మండల నాయకులు మిక్కిలినేని సతీష్, మధు, మాజీ సర్పంచ్ నరసింహారావు, బానోతు వెంకన్న,భద్రు, బానోతు శీను గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.