మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ
కోదాడ నవంబర్ 12(విజయక్రాంతి): కోదాడ మండలం కూచిపూడి తండాలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని(Village Women's Association Building) కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి(Kodad MLA Nalamada Padmavathi Reddy) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థలదాత బాదావత్ ముకుందా నాయక్‌ను అభినందించారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రామంలో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాదావత్ హాజీ నాయక్, ఉప సర్పంచ్ బాదావత్ సీత మహాలక్ష్మి కుమార స్వామి, సతీష్ కుమార్, మహిళ సంఘాబంద అధ్యక్షరాలు, బాదావత్ భూరి బాయి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ముకుందు నాయక్, బాబు నాయక్, ఉప అధ్యక్షులు బాదావత్ విజయ్, బాదావత్ గోపి, పాలక వర్గం, గ్రామ యువత పాల్గొన్నారు.