ఎస్ఆర్ఎం క్రీడాకారుల ఘనత.. రాష్ట్ర స్థాయికి ఎంపిక

10-11-2026 | 08:03pm

కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి

కోదాడ నవంబర్ 10(విజయక్రాంతి) : పట్టణంలోని ఎస్ఆర్ఎం పాఠశాల(SRM School) విద్యార్థులు బాస్కెట్ బాల్ పోటీల్లో(Basketball competition) రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(School Games Federation of India) వారు కోదాడ పట్టణంలోని(Kodad town) సీసీ రెడ్డి స్కూల్ ఆవరణలో ఈ నెల 9న నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు అండర్ 17 విభాగంలో ఏ షణ్ముఖప్రియ, అండర్ 14 విభాగంలో ఆర్తి శ్రీ,  తేజ వికాస్, ఉమా మహేష్ లు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు అర్హత సాధించారన్నారు. విజేతలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు