ప్రజలకు భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యం

27-11-2026 | 10:18pm

డి.ఎస్.పి. ప్రసన్నకుమార్

తుంగతుర్తి (విజయక్రాంతి) : తుంగతుర్తి పోలీసు స్టేషన్(Tungaturthi Police Station) ను శుక్రవారం సాయంత్రం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్(DSP Prasanna Kumar) వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. మొదటగా గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు. కేసుల తీరుతెన్నెలను ఎస్సై క్రాంతి కుమార్ తో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు మేమున్నామంటూ పోలీసులు నిరంతరం కృషి చేస్తారన్నారు. గతంలో మండలంలోని వివిధ గ్రామాల్లో శాంతిభద్రతలు తోపాటు ఏఏ కేసులలో కేసులు పెరిగాయో పరిశీలించడం జరిగిందన్నారు. గతం కంటే ఇప్పుడు పోలిస్తే రోడ్డు భద్రతల(Road safety) విషయంలో చాలా తగ్గుముఖం పట్టిందని, ల్యాండ్ ఇతర కేసులలో కేసులు పెరిగాయని పెరిగిన కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కృషి చేస్తామన్నారు.

గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే కేసులు చాలా తగ్గుముఖం పట్టాయని అన్నారు. గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ అరికట్టేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని గ్రామాల్లో శాంతి భద్రతను అదుపు చేస్తున్నామన్నారు. ఎవరైనా కానీ ఇంటి యజమాని ఎవరికైనా ఇల్లు ఇచ్చేటప్పుడు వారి యొక్క పూర్తి వివరాలు, ఆధార్ కార్డు వంటి సమాచారాలు సేకరించి నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజలు చేరువగా ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. వారి వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు, ఏఎస్ఐ సత్యనారాయణ, వెంకన్న, హెడ్ కానిస్టేబుల్స్ గురుస్వామి, సంజీవరావు, జహంగీర్, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు ఉన్నారు.

మరిన్ని వార్తలు