రేషన్ డీలర్లు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

12-11-2026 | 10:21pm

తుంగతుర్తి( విజయ క్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డీలర్ల సంఘం అధ్యక్షులు ఓర్సు వెంకన్న అన్నారు. గురువారం తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేలు కు వినతి పత్రం అందజేసి, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ల ప్రధాన సమస్య అయినటువంటి గౌరవ వేతనం ఐదువేల రూపాయలు ఇవ్వాలని కమిషన్ 300 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ను కోరినట్లు తెలిపారు. రేషన్ డీలర్లు ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని కమిషన్ తో బ్రతుకు వెల్లదీస్తున్నారని అన్నారు.

ఎల్ నీ నో ప్రభావంతో కరువు వచ్చేలా ఉందని ప్రజల అభిప్రాయం మేరకు నిత్యవసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలోతీగలవెంకన్న ,శోభారాణి ,మల్లయ్య ,రాములు ,లింగయ్య, భద్రా రెడ్డి వెంకట్ రెడ్డి,నరేష్ ,ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు