లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు..

07-10-2026 | 06:23pm

డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధితురాలి ఆవేదన

చివ్వెంల, అక్టోబర్ 7: సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం(Suryapet DSP Office) ఎదుట బుధవారం బాధితురాలు వాంకుడోతు అమ్మి విలేకరుల సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. బైబిగూడెం గ్రామానికి చెందిన భూక్య భాను తనను లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరమైన ఫొటోలు చూపిస్తానంటూ బెదిరించి విడతల వారీగా రూ.3 లక్షలు తీసుకున్నాడని ఆమె ఆరోపించారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి దాడి చేసేవాడని, శారీరక సంబంధానికి నిరాకరిస్తే ఫొటోలను బంధువులకు చూపిస్తానని బెదిరించేవాడని తెలిపారు. సెప్టెంబర్ 29న భూక్య భాను, అతని భార్య బుజ్జి ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేసి, రెండు తులాల బంగారు గొలుసు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సాధారణ కేసు నమోదు చేశారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.

మరిన్ని వార్తలు