1 September, 2026 | 12:43 AM

సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి

01-09-2026 12:05 AM

– తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి టౌన్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం పొందిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.45,31,100 విలువైన 150 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం ఆయన జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు, అర్హత లేని వారికి చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో అర్హులందరికీ సహాయం అందిస్తున్నామని చెప్పారు.