ఇందిరమ్మ జయంతి వేడుకలు

19-11-2026 | 11:53am

శ్రీరంగాపూర్, నవంబర్ 19 (విజయక్రాంతి): దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ (Indira Gandhi Birth Anniversary) జయంతి వేడుకలను శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మరి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి (Tributes to Indira Gandhi) పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి, జాతీయ సమగ్రతకు (National Unity) ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వంతో దేశ రాజకీయాల్లో (Indian Political History) ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు, కార్యదర్శి రెడ్డిచర్ల శ్రీహరి రాజు, శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విష్ణు ముదిరాజ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శేఠమోని రామచంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు బహుజన రమేష్, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు