20 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న బోరుకు పునర్జీవం
24, 25వ వార్డుల ప్రజలకు తీరనున్న తాగునీటి కష్టాలు
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
ఆలేరు, నవంబర్ 10 (విజయక్రాంతి): రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో(impact of El Niño) నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణంలోని వార్డుల్లో నీటి కొరత(Water Scarcity) లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఇందిరమ్మ కమిటీ(Indiramma Committee) సభ్యులు బెండే లాల్‌రాజ్, చల్లగురుగుల రఘుబాబు తెలిపారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని 25వ వార్డులో గత 20 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న చేతి బోరును మున్సిపల్ సిబ్బంది సహకారంతో పరిశీలించగా, అందులో నీరు ఉన్నట్లు గుర్తించారు.
దీంతో బోరులో మోటార్ ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న చేతి బోర్లను గుర్తించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ బోరు అందుబాటులోకి రావడంతో 24, 25వ వార్డుల ప్రజలకు నీటి ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ సభ్యులు భువనగిరి వెంకటరమణ, నాకోటి రాము, సాల్వర్ ఉపేందర్, గంగిశెట్టి నాగరాజు, పబ్బ భరత్, మాటూరి కిషోర్‌తో పాటు బస్తీ మహిళలు పాల్గొన్నారు.