ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌లో సైబర్ నేరాలపై అవగాహన...
ఆలేరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఎస్పీ ఆదేశాల మేరకు ఆలేరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఉదయ్(Uday, SHO of Alair Police Station) ఆధ్వర్యంలో ఎస్ ఐ వినయ్ మరియు సిబ్బందితో కలిసి ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో(Aleru ZPHS School) విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు అంటే ఏమిటి, ప్రస్తుతం జరుగుతున్న సాధారణ సైబర్ మోసాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.
సైబర్ ఆర్థిక మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బ్యాంకింగ్, ఖాతాలకు సంబంధించిన వివరాలను ఇతరులతో పంచుకోకూడదని, సైబర్ నేరాలను ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
టిప్ లైన్ (TIP Line) ప్రాధాన్యతను వివరిస్తూ, సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. విద్యార్థులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సైబర్ భద్రత, నేరాల నివారణకు సంబంధించిన సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.