ప్రభుత్వ ధరలకే నాణ్యమైన బియ్యం
బయట మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయవద్దు: DSO రోజారాణి
ఆలేరు,(విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని(Quality rice) ప్రభుత్వ నిర్దేశిత ధరలకే అందించేందుకు భువనగిరి పట్టణంలోని రైతు బజార్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్‌ను జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి(DSO Rojarani) మంగళవారం ప్రారంభించారు. ఈ కౌంటర్‌లో బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, జేఎస్ఆర్ బియ్యం రూ.79 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపారు.
ప్రజలు బయట మార్కెట్‌లో అధిక ధరలు చెల్లించి బియ్యం కొనుగోలు చేయకుండా, రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను వినియోగించుకుని నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వ ధరలకే కొనుగోలు చేయాలని రోజారాణి కోరారు.